What is Mailchimp Telugu

ఈ రోజు ఆర్టికల్ లో మనం Mailchimp అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.

Mailchimp అనేది ఒక ఈమెయిల్ మార్కెటింగ్ టూల్.

ఈమెయిల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక పార్ట్ అని మనకి తెలిసిందే. ఈమెయిల్ మార్కెటింగ్ చేయుటకు మనకు ఒక టూల్ కావలెను. మార్కెట్ లో ఈమెయిల్ మార్కెటింగ్ చేయుటకు అనేక టూల్స్ ఉన్నాయి వాటిలో ఒకటి Mailchimp.

Mailchimp అనేది చాలా పాపులర్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్.

మనం ముందు ఆర్టికల్ లో Convertkit అనే ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ కోసం explain చేసుకోవడం జరిగింది.

Mailchimp లో మనకి ఫ్రీ వెర్షన్ కూడా ఉంది. ఈ Mailchimp ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ని ఫ్రీగానే కొన్ని లిమిటెడ్ ఫీచర్ లతో ఉపయోగించవచ్చును.

మన వెబ్సైట్ కి రిపీటెడ్ ఆడియన్స్ కావాలి అంటే ఈమెయిల్ మార్కెటింగ్ ఎంతో సహాయపడుతుంది.

ఒకసారి ఆర్టికల్ ఫినిష్ చేసిన తర్వాత మనం మన లిస్ట్ కి మన బ్లాగ్ పోస్ట్ లింకు ఈమెయిల్ చేయవచ్చు. యిలా ప్రతిసారీ న్యూ ఆర్టికల్ కి ఈమెయిల్ లు పంపడం ద్వారా మనం ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా రిపీటెడ్ రీడర్ లను మన బ్లాగ్ కి తెచ్చుకోవచ్చు.

మనం ఈ Mailchimp అకౌంటు ని 500 కాంటాక్ట్ లు వరకు లిమిటెడ్ ఫీచర్ లతో యూస్ చేయవచ్చు.

ఫ్రీ వెర్షన్ లో మనం మంత్ కి 2500 ఈమెయిల్ లు మాత్రమే పంపగలము.

మనం ఈ ఫ్రీ వెర్షన్ లో forms అండ్ లాండింగ్ పేజీలు క్రియేట్ చేసుకోవచ్చు.

మరెన్నో ఫీచర్ లు కోసం మనం మన ఫ్రీ ప్లాన్ ని ప్రీమియం ప్లాన్ గా upgrade చేసుకోవలెను.

Mailchimp కి సంబందించిన మరెన్నో విషయాలు వచ్చే ఆర్టికల్ లలో తెలుసుకోవచ్చు.

ధన్యవాదములు.

Scroll to Top