What is Email Marketing Telugu

ఈ రోజు ఆర్టికల్ లో ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.

ఈమెయిల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక పార్ట్.

మన ఆడియన్స్ నుండి ఈమెయిల్ లు కలెక్ట్ చేసి వాళ్ళకి రెగ్యులర్ గా ఈమెయిల్ లు పంపుతూ మన బిజినెస్ ని promote చేసుకోవడాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు.

ఈ ఈమెయిల్ మార్కెటింగ్ చేయుటకు మనకి మార్కెట్ లో వివిధ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ లు ఉన్నాయి. వాటిలో కొన్ని Convertkit , Mailchimp etc.

మనం ఈమెయిల్ ఐడి లును మన ఆడియన్స్ నుండి కలెక్ట్ చేయుటకు మనం ముందుగా ఒక లాండింగ్ పేజీ మరియు ఒక lead మాగ్నెట్ క్రియేట్ చేయవలెను.

మనం యూజర్ నుండి ఈమెయిల్ కలెక్ట్ చేయుటకు మనం ఒక ఫ్రీ రిసోర్స్ లైక్ eBook లేదా మినీ వీడియొ కోర్సు క్రియేట్ చేయవలెను. యూజర్ వాళ్ళ ఈమెయిల్ ఐడి కి సబ్మిట్ చేసి ఈ ఫ్రీ రిసోర్స్ ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఇక్కడ మనం ఇచ్చే ఫ్రీ రిసోర్స్ నే lead మాగ్నెట్ అంటారు.

యూజర్ తన ఈమెయిల్ ఎంటర్ చేసే form ని optin form అని అంటారు.

అయితే యూజర్ నుండి మనం ఈమెయిల్ ఐడిలు వివిధ రూపములలో కలెక్ట్ చేయవచ్చును.

మన వెబ్సైట్ విజిటర్స్ ని మన ఈమెయిల్ subscribers గా చేసుకోవచ్చును. దీనికి మనం optin form ని popup window లో కానీ , right సైడ్ బార్ లో కానీ , కంటెంట్ మధ్య కానీ , footer లో కానీ పెట్టవలెను. లేదా మన వెబ్సైట్ విజిటర్స్ ని optin form ఉన్న లాండింగ్ పేజీ కి divert చేయవలెను.

next మన యూట్యూబ్ viewers ని కూడా మన ఈమెయిల్ subscribers గా మార్చుకోవచ్చును. దీనికి మనం ఈ ట్రాఫిక్ ని మన లాండింగ్ పేజీ కి divert చేయవలెను.

మన సోషల్ మీడియా ఆడియన్స్ ని కూడా ఈమెయిల్ subscribers గా మార్చుకోవచ్చును. వీళ్ళని కూడా లాండింగ్ పేజీ కి divert చేయవలెను.

మనం పెయిడ్ యాడ్స్ రన్ చేసి కూడా మన ఈమెయిల్ subscribers ని పెంచుకోవచ్చును. ఇక్కడ పెయిడ్ ట్రాఫిక్ ని మన లాండింగ్ పేజీ కి divert చేయవలెను.

యిలా వివిధ పద్దతులలో మనం మన యూజర్స్ నుండి ఈమెయిల్ ఐడిలు కలెక్ట్ చేయవచ్చును.

ఆ తర్వాత వాళ్ళకి వివిధ ఈమెయిల్ లు పంపుతూ మన ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ లును ప్రమోట్ చేసుకుంటాము.

ఇదే ఈమెయిల్ మార్కెటింగ్.

ఈమెయిల్ మార్కెటింగ్ లో ఒక ముఖ్యమయిన టాపిక్ ఈమెయిల్ ఆటోమేషన్. దీని గురించి తర్వాత ఆర్టికల్ లో నేర్చుకుందాము.

మీకు ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.

ధన్యవాదములు.

Scroll to Top