What is Domain Name Telugu

ఈ రోజు ఆర్టికల్ లో డొమైన్ నేమ్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.

మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలన్న లేదా ఏదయినా వెబ్సైట్ విసిట్ చేయాలన్న మనకి డొమైన్ నేమ్ అవసరం.

డొమైన్ నేమ్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే, ఇంటర్నెట్ లో మన వెబ్సైట్ కి గల అడ్రసు ని డొమైన్ నేమ్ అనవచ్చు.

ఇప్పుడు మనం ఫేస్బుక్ observe చేస్తే facebook.com అనేది ఫేస్బుక్ అనే వెబ్సైట్ కి ఆన్లైన్ లో అడ్రసు అని చెప్పవచ్చు. దీనినే డొమైన్ నేమ్ అని అంటారు.

ఇప్పుడు మనం మన వెబ్సైట్ ని స్టార్ట్ చేయాలి అంటే మనకి మెయిన్ గా డొమైన్ నేమ్ మరియు వెబ్ హోస్టింగ్ అవసరము.

మన వెబ్సైట్ files ని ఆన్లైన్ లో పెట్టుటకు కొంత మెమరీ స్పేస్ అవసరము. దీని కోసం సర్వర్ ను ఏర్పాటు చేస్తారు. దీనినే వెబ్ హోస్టింగ్ అంటారు.

సహజంగా ఈ సర్వర్ కి అడ్రసు ip అడ్రసు ఉంటుంది. మన files లేదా మన వెబ్సైట్ ని యూజర్లు విసిట్ చేయాలి అంటే ఈ ఐపి అడ్రసు ద్వారా విసిట్ చేయాలి.

మనకి ఐపి అడ్రసు ఇలా ఉంటుంది. x.x.x.x. Where x is 0 to 255

అహితే ఇలా ఐపి అడ్రసు ను గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. అందు కోసం ఈ డొమైన్ నేమ్ ని తీసుకువచ్చారు.

మనం డొమైన్ నేమ్ ఎంటర్ చేస్తాం. కానీ background లో అది ఐపి అడ్రసు లా మారి ఆ సర్వర్ కి కనెక్ట్ అయ్యి మనకి కావలసిన ఇన్ఫర్మేషన్ ని మన వెబ్సైట్ display చేస్తుంది.

ఈ డొమైన్ venkatranda.com లో .com ని top లెవెల్ డొమైన్ or tld or domain extension అని అంటారు.

మనకి tlds different గా ఉంటాయి. .com, .in. .biz, .online etc

ఇక్కడ tld మారితే డొమైన్ నేమ్ కూడా మారినట్టే.

Venkatranda.com and venkatranda.in అనేవి విభిన్న డొమైన్ నేమ్ లు.

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.

మీకు ఇంకేమయిన సందేహాలు ఉంటే నాకు మెయిల్ చేయవచ్చు.

ధన్యవాదములు.

Venkat Randa
Latest posts by Venkat Randa (see all)

Spread your Love.

Also Read.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top