ఈ రోజు ఆర్టికల్ లో మనం WordPress అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.
WordPress అనునది ఒక Content Management System. షార్ట్ గా cms అని అంటారు.
ఇది వెబ్ డెవలప్మెంట్ మార్కెట్ లో ఎక్కువగా వాడే cms సాఫ్ట్వేర్.
ఇంటర్నెట్ లో సుమారుగా 43% వెబ్సైటు లు వర్డుప్రెస్సు తో బిల్డ్ చేసినవే. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు వర్డుప్రెస్సు అనునది ఎంత పాపులరో.
వర్డుప్రెస్సు అనునది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్.
దీనిని మనం ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకొని మన వెబ్ హోస్టింగ్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే వర్డుప్రెస్సు అనునది ఫ్రీ సాఫ్ట్వేర్. కాకపొతే దీనిని మనం ఉపయోగించాలంటే వెబ్ హోస్టింగ్ purchase చేసి అప్పుడు దీనిని మనం అందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
వర్డుప్రెస్సు ద్వారా మనం max ఎటువంటి వెబ్సైటు అయినా క్రియేట్ చేయవచ్చు.
బ్లాగ్ వెబ్సైటు , బిజినెస్ వెబ్సైటు , వన్ పేజీ వెబ్సైటు , ecommerce వెబ్సైటు , మెంబర్షిప్ వెబ్సైటు , lms వెబ్సైటు మొదలగు వెబ్సైటు లను వర్డుప్రెస్సు ఉపయోగించి క్రియేట్ చేయవచ్చు.
వర్డుప్రెస్సు లో మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటి అంటే ప్లగిన్స్ మరియు థీమ్స్.
ఒకో functionality కి మనకి ఒకో రకమయిన ప్లగిన్ ఉండటం జరిగింది.
ఈ ప్లగిన్ లు మరియు థీమ్ లు ఉపయోగించి వెబ్సైటు ను మనకి కావలసిన విధంగా మార్చుకోవచ్చు.
మనం ecommerce వెబ్సైటు కావాలి అంటే Woocommerce ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం, కోర్స్ వెబ్సైటు కావాలి అంటే tutor lms ఇన్స్టాల్ చేయడం.
యిలా మనకి కావలసిన functionality కి తగ్గ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవలెను.
మీకు ఒక డౌట్ రావొచ్చు, ఈ సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి అని .
మనకి హోస్టింగ్ కంపెనీలు ఈ ప్రాసెస్ ని చాలా సింపుల్ చేసినవి.
మనం హోస్టింగ్ purchase చేసిన తర్వాత మనం సింగల్ క్లిక్ లో WordPress ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
Vapourhost లాంటి కంపెనీలు ఇటువంటి సింపుల్ ప్రాసెస్ ని తీసుకువచ్చాయి.
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.
మీకు ఏమయినా టెక్నికల్ హెల్ప్ కావాలి అంటే ఇప్పుడే మాకు మెసేజ్ చేయండి.
ధన్యవాదములు.