What is Shopify Telugu

హలో ,  ఈ రోజు ఆర్టికల్ లో మనం Shopify అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. 

ఫ్రెండ్స్ , Shopify అనేది ఒక SAAS టూల్. ఇది ఒక online ecommerce టూల్. 

దీని ద్వారా మనం ecommerce store చాలా సులభంగా స్టార్ట్ చేయొచ్చు. 

మనం మన డొమైన్ ని కూడా లింక్ చేసుకోవచ్చు. 

ప్రత్యేకంగా దీని కోసం హోస్టింగ్ ఏమి కొనవసరం లేదు. 

ఈ సాఫ్ట్ వేర్ ను మనం మంత్లీ లేదా yearly ప్లాన్ తీసుకొని use చేయవలెను. 

అయితే మీకు ఒక డౌట్ రావొచ్చు , మనం వర్డుప్రెస్సు లో ecommerce సైట్ బిల్డ్ చేయొచ్చు కదా ఇది ఎందుకు అని. 

చెప్పానుగా ఇది ఒక saas టూల్. దీని ద్వారా మనం ecommerce స్టోర్ ఏ టెక్నికల్ knowledge లేకపోయినా దీనిని రన్ చేయవచ్చు. 

మనం Woocommerce తో స్టోర్ చేయాలి అంటే మనకు కొంత టెక్నికల్ knowledge అవసరం. 

Woocommerce అయితే ఫుల్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. 

Shopify లో ఫుల్ కంట్రోల్ మన చేతిలో ఉండదు. కాకపొతే వారే మన స్టోర్ ని మేనేజ్ చేస్తారు. 

మనం ఎటువంటి టెక్నికాలిటీ లు కోసం ఆలోచించకంగా మనం మన యొక్క బిజినెస్ కోసం ఫోకస్ చేయవచ్చు. 

ఎందులో ఉండే అడ్వాంటేజెస్ అందులో ఉన్నాయి. 

మీకు కొంత టెక్నికల్ నాలెడ్జి ఉండి , మీ స్టోర్ మీరే ఓన్ గా మేనేజ్ చేసుకోగలరు అంటే మీకు Woocommerce బెస్ట్ ఆప్షన్. 

చాలా కోణాలలో Woocommerce బెస్ట్ ఆప్షన్. 

కాకపోతే వర్డుప్రెస్సు లో డిఫరెంట్ ప్లగిన్ లు ఉండడం వల్ల వివిధ ఎర్రర్ లు వచ్చే అవకాశం ఉన్నాయి. 

మనం వెంటనే ఈ ఎర్రర్ లను ఫిక్స్ చేసుకోకపోతే మన బిజినెస్ లో అవుతుంది. 

అలాంటపుడు మీరు ఒక వర్డుప్రెస్సు డెవలపర్ ను hire చేసుకోవాలి. 

పెద్ద బిజినెస్ వాళ్లకి అయితే hire చేసుకోవడం ఓకే చిన్న బిజినెస్ లకు ఈ స్టెప్ కొంచెం కష్టమే. 

అందుకే వీరు alternative కోసం చూస్తారు. 

అప్పుడు మనకి బెస్ట్ వన్ ఏమిటి అంటే Shopify 

ఇందులో హోస్టింగ్ కోసం ఆలోచించనవసరం లేదు . backup లకు కోసం ఆలోచించనవసరం లేదు. 

వివిధ ఎర్రర్ లు వస్తాయని కంగారు పడనవసరం లేదు. 

కావున మీరు మీ స్టోర్ స్టార్ట్ చేయడానికి సింపుల్ టెక్ కోసం చుస్తే Shopify అనునది లిస్ట్ లో ఉంటుంది. 

మీకు మీ స్టోర్ సెటప్ చేసుకోవడం లో ఏదయినా టెక్నికల్ హెల్ప్ కావాలి అంటే మాకు మెసేజ్ చేయండి. 

ధన్యవాదములు.