Digital Marketing Terms Telugu

ఈ రోజు డిజిటల్ మార్కెటింగ్ లో కొన్ని ముఖ్యమైన పదాలు గురించి తెలుసుకోవచ్చు.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి.

ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ సమయాన్ని ఆన్లైన్ లోనే గడుపుతున్నారు.

కావున మీ బిజినెస్ గురించి ఆన్లైన్ లో మార్కెటింగ్ చేసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.

ఇప్పటికే చాల బిజినెస్ లు డిజిటల్ మార్కెటింగ్ వాడుతున్నాయి. ఇంకా మీరు డిజిటల్ మార్కెటింగ్ కి కొత్త అయితే ఈ బ్లాగ్ ద్వారా మీరు డిజిటల్ మార్కటింగ్ గురించి తెలుసుకోవచ్చు.

బిజినెస్ లు డిజిటల్ మార్కెటింగ్ వైపుకు మూవ్ అవ్వడంతో Digital Marketing Experts కి మంచి డిమాండ్ ఉంది.

మీరు కనుక స్టూడెంట్ అయితే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల మీరు డిజిటల్ మార్కెటింగ్ లో మంచి జాబు తెచ్చుకోవచ్చు.

లేదంటే మిరే స్వయంగా ఒక బ్లాగ్ లేదా కంపెనీ స్టార్ట్ చెయ్యొచ్చు.

ఇక డిజిటల్ మార్కెటింగ్ లో కొన్ని పదాలు గురించి డిస్కస్ చేసుకోవచ్చు.

Online Marketing / Internet Marketing

ఇంటర్నెట్ ద్వారా మన ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ని ప్రమోట్ చేసుకోవడాన్ని ఆన్లైన్ మార్కెటింగ్ (Online Marketing / Internet Marketing) అంటారు.

Search Engine Optimization

Search Engines లో మన యొక్క వెబ్సైటు లేదా బ్లాగ్ ని టాప్ లోకి తీసుకురావడానికి చేసే పద్ధతినే Search Engine Optimization అంటారు.

ఇప్పట్లో పాపులర్ సెర్చ్ ఇంజిన్స్ గూగుల్ మరియు యుట్యూబ్.

అయితే ఈ పద్దతిలో మనం సెర్చ్ ఇంజిన్స్ కి ఏమి అమౌంట్ కట్టనవసరం లేదు.

కాకపోతే ఈ పద్దతి ద్వారా రిజల్ట్స్ రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయం మీ యొక్క బిజినెస్ కాంపిటీషన్ మీద ఆధారపడి ఉంటుంది.

Search Engine Marketing

సెర్చ్ ఇంజిన్స్ కి కొంత అమౌంట్ పే చేసి మన యొక్క వెబ్సైటు లేదా బ్లాగ్ ని ప్రచారం చేసుకోవడాన్ని Search Engine Marketing అంటారు.

ఇందులో మనకి PPC Advertising and Display Advertising ఉంటాయి.

PPC Advertising అంటే Google Search results లో మన యొక్క వెబ్సైటు లేదా బ్లాగ్ ని టాప్ లోకి తీసుకురావడం. మనం గూగుల్ లో ఏమైనా సెర్చ్ చేసినప్పుడు మనకు సెర్చ్ రిజల్ట్స్ పైన మరియు క్రింద కొన్ని యాడ్స్ వస్తాయి.

ఇవి PPC Advertising చేయడం ద్వారా వచ్చే రిజల్ట్స్.

Display Advertising అంటే మన యొక్క యాడ్స్ వేరే వెబ్సైటు లేదా బ్లాగ్ లో వచ్చేలా చేయడం. మనం ఇంటర్నెట్ లో కొన్ని వెబ్సైటులలో యాడ్స్ వస్తాయి.

ఇవి Display Advertising ద్వారా వచ్చే రిజల్ట్స్.

Social Media Marketing

మన యొక్క బిజినెస్ ని సోషల్ మీడియా Platfroms ద్వారా ప్రమోట్ చేసుకోవడాన్ని Social Media Marketing అంటారు.

ఇందులో మనం వాడే సోషల్ మీడియా Platformని బట్టి ఆ విదమైన పేరుతొ పిలుస్తారు.

ఉదాహరణకు మీరు Facebook ద్వారా ప్రమోట్ చేసుకుంటే Facebook Marketing అని అంటారు.

CPM

CPM అంటే Cost per Mile.

ప్రతి వెయ్యి వ్యూస్ లేదా impressions కి పే చేసే అమౌంట్ ని CPM అంటారు. మీరు ఇప్పటికే Google Adsense యూజర్ అయితే ఈ పదాన్ని వినే ఉంటారు.

CPC

CPC అంటే Cost Per Click

ప్రతి క్లిక్ కి పే చేసే అమౌంట్ ని CPC అంటారు.

CTR

CTR అంటే Click through rate

RPM

RPM అంటే Revenue per mile

CPA

CPA అంటే Cost per action / acquisition

మీకు ఈ ఆర్టికల్ సహాయ పడుతాదని అనుకుంటున్నాను.

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను.

Scroll to Top