ఈ రోజు మనం డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకుందాం.
అవును నువ్వు బిజినెస్ ఓనర్ అయిన మార్కెటింగ్ మేనేజర్ అయిన స్టూడెంట్ అయిన ఈ రోజుల్లో నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి.
మీరు ఒక కంపెనీ ఓనర్ అనుకొండి. మీరు ఒక ఉత్తమమైన ప్రోడక్ట్ తయారుచేసారు. మరి దానిని ఎలా జనంలోకి తీసుకువెళ్తారు.
వెంటనే మీరు ఆ ప్రోడక్ట్ గురించి ప్రచారం చెయ్యాలి అంటారు. అయితే ఏ విధంగా ప్రచారం చేస్తారు.
కొంతమంది దీనికి న్యూస్ పేపర్ లో యాడ్ ఇస్తాం అంటారు. మరికొంతమంది టీవీలో యాడ్ ఇస్తాం అంటారు. మరికొంతమంది ఊరూరు తిరుగుతూ మైక్ ద్వారా ప్రచారం చేస్తాం అంటారు.
అయితే పైన చెప్పిన వాటి ద్వారా ప్రచారం చేస్తే మీకు ఒక బడ్జెట్ అవసరం అవుతుంది.
ఓకే మీరు కొంత బడ్జెట్ పెట్టారు. అయితే మీ ప్రచారం ఖచ్చితంగా ఎంత మందిని చేరుతుందో చెప్పగలరా? ఎంత మంది మీ ప్రోడక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉందో చెప్పగలరా?
ఈ పద్దతిలో మీరు ఖచ్చితంగా చెప్పలేరు. సుమారుగా మాత్రమే చెప్పగలరు.
మీరు ఈ పద్దతిలో ప్రచారం చేసేటప్పుడు కేవలం ఒక ఏజ్ గ్రూప్ వారికే చేరేలా చెయ్యగలరా? ఒకే జెండర్ కి చేరేలా చెయ్యగలరా?
మీ కస్టమర్ ఇంట్రెస్ట్ ను బట్టి వారికి మాత్రమే చేరేలా చెయ్యగలరా? ఖచ్చితంగా ఇలా కూడా చెయ్యలేరు.
వీటన్నిటికి సమాధానమే డిజిటల్ మార్కెటింగ్. ఇవన్ని మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చెయ్యొచ్చు.
మీరు గూగుల్ యాడ్స్ లో కొంచెం అమౌంట్ పెడితే మీ యొక్క ప్రోడక్ట్ గురించి కస్టమర్ కి తను గూగుల్ లో దానికి రిలేటెడ్ గా సెర్చ్ చేసినప్పుడే display చెయ్యొచ్చు.
దీని ద్వారా మీ ప్రోడక్ట్ సేల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఎందుకంటే కస్టమర్ మీ ప్రోడక్ట్ సాల్వ్ చేసే ప్రాబ్లం గురించి వెదుకుతున్నాడు కాబట్టి.
మీరు ఫేస్బుక్ యాడ్స్ లో కొంచెం అమౌంట్ పెడితే మీ యొక్క ప్రోడక్ట్ గురించి పలు రకాలుగా ప్రచారం చేసుకోవచ్చు.
దీనికి ఖచ్చితంగా ఎంత బడ్జెట్ అవుతుందో ఎంత మందిని రీచ్ అవుతుందో మీరు ఎప్పటికప్పుడు Analytics ద్వారా తెలుసుకోవచ్చు.
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటానికి ఇలా పలు రకాల కారణాలు ఉన్నాయి.
ఇప్పుడు చాలా బిజినెస్ లు డిజిటల్ మార్కెటింగ్ వైపు అడుగులు వేస్తున్నాయి.
కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మొదలగు డిజిటల్ మార్కెటింగ్ జాబులకు డిమాండ్ ఉంది.
దీనికి అనుగునంగా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ లో జాబు తెచ్చుకోవచ్చు.
ఈ ఆర్టికల్ చదివినందుకు దన్యవాదములు. మీకు సహాయపడుతాది అని అనుకుంటున్నాను.
మీకేమైనా సందేహాలు ఉంటె క్రింద కామెంట్ చెయ్యండి లేదా ఈమెయిల్ చెయ్యండి.