నా యొక్క YouTube Journey మీ కోసం

Feb 2016 లో నా యూట్యూబ్ ప్రయాణం మొదలుపెట్టాను. 

ఏదో కొత్తగా చేయాలి అన్న తపన. 

కంప్యూటర్ గురించి తెలుసు అలాగే ఇంటర్నెట్ ని కూడా కొంచెం బెటర్ గా ఉపయోగించడం తెలుసు. 

దీనినే చొరవగా తీసుకొని ఏదయినా కొంచెం కొత్తగా చేద్దాము అనుకున్నా. 

అప్పుడు నా చేతిలో ఉన్నది ఒక Laptop మాత్రమే. No లైటింగ్ , no any professional setup. కాని ఒకటి కచ్చితంగా ఏదయినా కొత్తగా చేయాలి అనే తపన. 

అప్పటికే బ్లాగింగ్ కోసం తెలుసు కానీ proper guidance లేక almost ఫెయిల్ అయ్యాను. 

అయితే యూట్యూబ్ చేద్దాము అనుకున్నా. 

కానీ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. 

ఒక చిన్న బయట పని చేయటం వల్ల ఒక 1k వచ్చినాయి. అలాగే my parents ఒక 1k ఇవ్వడం జరిగింది. 

ఈ 2k తో మూడు నెలలకు సరిపడ ఇంటర్నెట్ కనెక్షన్ వేయించుకోవడం జరిగింది. 

యూట్యూబ్ వీడియో లు చేయాలి అంటే నాకు కొత్త. కానీ ఎటువంటి భయం పడలేదు ఎందుకంటే అప్పటికే నాకు ఒక స్కూల్ లో Maths teach చేసిన అనుభవం ఉంది. 

దాని వల్లేనేమో నేను ఎంతో కాన్ఫిడెంట్ గా వీడియోస్ చేసేవాడిని. 

మొదటగా ఇంగ్లీష్ లో చేయడం మొదలుపెట్టాను. అలా ఒక రెండు వారములు చేశా. 

ఒకసారి వెనుకకి తిరిగి చుస్తే ఎటువంటి రెస్పాన్స్ లేదు. 

ఏంటి దీనికి కారణం అని నన్ను నేను ప్రశ్నించుకున్నా? అయితే వీడియో క్వాలిటీ. 

ప్రస్తుతం నేను వీడియో క్వాలిటీ ని పెంచడానికి నా దగ్గర తగిన రిసోర్సెస్ లేవు ఉన్న రిసోర్సెస్ తోనే బెటర్ output తీసుకురావాలి అనుకున్నా. 

తర్వాత నా నెట్వర్క్ లో అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ తెలుగు ప్రజలు. 

అప్పుడు తెలుగు లో చేద్దాము అనుకున్న. తెలుగు అయితే మనకు కొంచెం సులభం అవుతాది అలాగే చూసే వాళ్లకి కూడా క్లియర్ గా అర్ధం అవుతాది అని అనుకున్నా. 

తర్వాత నుండి తెలుగు లో చేయడం మొదలు పెట్టాను. 

అయినా response రావడం లేదు కానీ నా ప్రయత్నం ఆపలేదు. ఎక్కువ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ వీడియోస్ చేసేవాడిని ఎందుకంటె వాటిలోనే నేను కొంచెం strong. 

మనకు తెలిసిన టాపిక్స్ మీదే వీడియోస్ చేస్తే బెటర్ అని అనుకున్న అలాగే చేసేవాడిని. 

అప్పుడు మార్కెట్ లో Paytm కొత్తగా వచ్చింది. అప్పుడు నేను Paytm , Freecharge , Oxygen Wallet , Maths ఇటువంటి వీడియో లు ఎక్కువగా చేసాను. 

అప్పుడే వచ్చింది demonetization మన గవర్నమెంట్ నుండి. 

అప్పుడు మన తెలుగు ప్రజలు ఎక్కువగా Paytm గురించి సెర్చ్ చేసి ఉంటారేమో అందుకే ఆ వీడియో Viral Video గా మారింది. 

ఆ వీడియో కి views రావడంతో Subscribers కూడా రావడం జరిగింది. 

ఆ ఎఫెక్ట్ తో మిగతా వీడియోలు కి కూడా attention రావడం జరిగింది. 

అప్పటికే నాకు Paypal and Payza కోసం తెలుసు. 

వీటి మీద కూడా నేను నా ఛానల్ లో వీడియోస్ చేసాను. 

అయితే ఎందుకయినా మంచిది అని ఛానల్ లో నా మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 

ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి మీ వీడియోస్ చాలా బాగున్నాయి అలాగే చాలా వివరముగా చెబుతున్నారు అని feedback ఇవ్వడం జరిగింది. 

ఆ మాటలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. 

అదే తీరులో వీడియోస్ చేస్తూ ఉన్న. 

Same person మల్లి ఫోన్ చేసి తనకు Paypal and Payza అకౌంట్ లు సెటప్ చేయాలి అని అన్నారు. 

ఆయనది తాడేపల్లిగూడెం. నేను అప్పుడు వడిశలేరు లో ఉండేవాడిని. 

అయితే ఆయనని రాజమండ్రి గోదావరి పార్క్ దగ్గరకు రమ్మన్నాను. 

నేను నా laptop తీసుకొని అక్కడికి వెళ్లాను. ఇద్దరము గోదావరి గట్టున కలిసి చాలా సమయం వివిధ అంశములు పయిన డిస్కస్ చేసాము. 

తర్వాత ఆయనకు Paypal and Payza అకౌంట్స్ సెటప్ చేసి ఇచ్చాను. మీకు వీటిని వాడేటప్పుడు ఏమయినా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి అన్నాను. 

అప్పుడు ఆయన నాకు కొంత అమౌంట్ పే చేయడం జరిగింది. 

అదే నా ఫస్ట్ online వర్క్ లు నుండి వచ్చిన పేమెంట్. 

అప్పుడు నాకు ఒకటి క్లియర్ గా అర్ధం అయ్యింది, ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ మనం ఆన్లైన్ లో క్రియేట్ చేస్తే మనం అమౌంట్ సంపాదించవచ్చు అని. 

ఆ తర్వాత Dubai నుండి ఒక తెలుగు person Facebook Marketing సర్వీస్ కోసం approach అవ్వడం జరిగింది. 

అలా కొంత మంది ప్రతి నెల నన్ను సంప్రదించి చిన్న చిన్న సర్వీసెస్ తీసుకొనేవారు మంచిగానే పే చేసేవారు. 

అప్పుడు నేను parallel గా Post Office లో BPM గా చేసేవాడిని. 

నేను BPM గా Aug 2016 జాయిన్ అయ్యాను. అయితే పోస్ట్ ఆఫీస్ డ్యూటీ ఓన్లీ మార్నింగ్ మాత్రమే ఉండేది. 

అలా morning పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ affternoon ఆన్లైన్ work చేస్తూ మంచిగానే సంపాదించేవాడిని. 

చెప్పాలి అంటే తల్లిదండ్రుల మీద కొంచెం భారం తగ్గించాను. 

2017 లో almost యూట్యూబ్ స్టార్ట్ చేసిన one year తర్వాత నాకు Google Adsense నుండి పేమెంట్ వచ్చింది. 

అలా రెండు నెలలకు మూడు నెలలకు అలా నాకు Adsense పేమెంట్ వచ్చేది. 

అలా online అమౌంట్ , జాబ్ అమౌంట్ రెండింటితో ముందుకు నడిచేవాడిని. 

అయితే జాబ్ లో నాకు satisfaction లేక 2019 Dec లో resign చేసి online వర్క్స్ ని full time గా తీసుకున్నా. 

అప్పటి నుండి ఈ రోజుకి కూడా నేను online works మాత్రమే చేస్తున్న. 

అయితే ఒక చిన్న mistake వల్ల Feb 2016 లో స్టార్ట్ చేసిన ఛానల్ ఇప్పుడు ఉంది కానీ అందులో కంటెంట్ ఏమి ఉండదు. 

తర్వాత Jun 2019 మరొక ఛానల్ స్టార్ట్ చేశా. అదే ఇప్పుడు మీరు Consume చేసుకుంటున్న ఛానల్ “Venkat Randa”. 

Web Design నుండి ఆ Website ని onlineలో ప్రమోట్ చేయడం వరకు వివిధ బిజినెస్ కి సర్వీస్ ఇస్తూ చేసుకుంటూ వస్తున్నా. 

ఈ జర్నీ లో చాలా ups and downs చూసాను, కొత్త మందిని కలిసాను. 

అది మరి నా online journey. 

చెప్పుకుంటూ పొతే చాలా ఉంటాది. 

Online కంటెంట్ ని తక్కువ అంచనా వేయకండి. 

కంటెంట్ క్రియేట్ చేయండి దీని వల్ల మీ personal లైఫ్ అలాగే బిజినెస్ బెటర్ అవుతాయి. 

సరే అయితే మరి. 

మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. 

నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్న నా Wife అలాగే Parents కి నేను ఎప్పుడు రుణపడే ఉంటా. 

నా కంటెంట్ ని ఆదరిస్తున్న మీకందరికీ ధన్యవాదములు. 

ఇంకో పోస్ట్ లో కలుసుకుందాము.

ధన్యవాదములు.

Scroll to Top