ఈ రోజు ఆర్టికల్ లో Instagram మార్కెటింగ్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు.
Instagram మార్కెటింగ్ అనేది సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఒక పార్ట్. సోషల్ మీడియా మార్కెటింగ్ లో మనం Instagram platform టార్గెట్ చేస్తే ఆ మార్కెటింగ్ Instagram మార్కెటింగ్ లోకి వస్తుంది.
మన ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ ని Instagram అనే సోషల్ మీడియా platform ద్వారా promote చేసుకోవడాన్ని Instagram మార్కెటింగ్ అంటారు
ఇందులో మనకి organic Instagram మార్కెటింగ్ మరియు paid Instagram మార్కెటింగ్ అనేవి ఉంటాయి.
Organic Instagram మార్కెటింగ్ లో మనం టైమ్ ఇన్వెస్ట్ చేసి కంటెంట్ క్రియేట్ చేసి మన ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ ని promote చేసుకుంటాము. మనం కంటెంట్ క్రియేట్ చేయలేకపోతే మనం కంటెంట్ క్రియేటర్ లు నుండి outsource చేసుకుంటాము. ఇందులో మనం Instagram కి ఏమి pay చేయము.
యిందులో మనం Instagram ప్రొఫైల్ setup చేసి దానిని బిజినెస్ అకౌంటు టైపు లోకి మార్చవలెను. తర్వాత దీనిని మన ఫేస్బుక్ బిజినెస్ పేజీ తో లింకు చేయవలెను.
తర్వాత ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ ద్వారా మనం మన Instagram ప్రొఫైల్ లో కంటెంట్ పెట్టవచ్చు. కావాలి అంటే కంటెంట్ ని షెడ్యూల్ కూడా చేయవచ్చు.
డైరెక్ట్ గా Instagram app నుండి ద్వారా కూడా కంటెంట్ పబ్లిషింగ్ చేయవచ్చు.
Insights ద్వారా మన కంటెంట్ performance తెలుసుకోవచ్చు.
Paid Instagram మార్కెటింగ్ నే Instagram Ads అని కూడా అంటారు.
Instagram Ads ద్వారా మన ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ లును Instagram కి అమౌంట్ pay చేసి promote చేసుకుంటాము.
Instagram ప్రొఫైల్ setup చేసి దానిని బిజినెస్ అకౌంటు ల కన్వర్ట్ చేయవలెను. తర్వాత మన ఫేస్బుక్ బిజినెస్ పేజీ తో లింకు చేయవలెను.
తర్వాత ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ద్వారా Instagram యాడ్స్ రన్ చేసుకోవచ్చు. బిల్లింగ్ tab లో మనం అమౌంట్ add చేయవలెను.
యిక్కడ మనం Facebook Ads మరియు Instagram Ads, Facebook Business Manager నుండే క్రియేట్ చేస్తాము.
Adset లెవెల్ లో మనం placements Facebook కి సంబంధించినవి సెలెక్ట్ చేసుకుంటే అవి Facebook Ads అదే Instagram సంబంధించినవి సెలెక్ట్ చేసుకుంటే అవి Instagram Ads.
ఈ Ads ని ఎప్పటికప్పుడు observe చేయుటకు మనకి మొబైలు యాప్ కూడా ఉంది Meta Ads.
మరెన్నో విషయాలు upcoming articles లో తెలుసుకోవచ్చు.
Next ఆర్టికల్ లో కలుద్దాము.
ధన్యవాదములు.