ఈ రోజు ఆర్టికల్ లో మనం సాధారణంగా నేను నా Clientsకి Websites ఏ Process లో Develop చేస్తానో అలాగే ఎలా డెలివరీ చేస్తానో తెలుసుకుందాము.
ఎక్కువగా నేను Client ని approach అవ్వడం కంటే Clients నన్ను వారి Web డిజైన్ కోసం approach అవుతారు.
నేను ఎక్కువగా Website మరియు YouTubeలో మా Services related కంటెంట్ క్రియేట్ చేస్తాను. దీని ద్వారా Clients నన్ను approach అవుతారు.
నేను content ఎక్కువగా తెలుగులోనే క్రియేట్ చేస్తాను కావున నన్ను ఎక్కువగా AP మరియు TS నుండే కాంటాక్ట్ చేస్తారు.
నన్ను ఎక్కువగా WhatsApp లేదా direct call ద్వారా కాంటాక్ట్ చేస్తారు.
వారు నన్ను కాంటాక్ట్ చేసిన తరువాత వారికి ఏమి కావాలో చాలా వివిరంగా అడిగి తెలుసుకుంటాను.
వారి అవసరానికి తగ్గట్టుగా వెబ్సైటు కి కావలసినవి అన్ని లిస్ట్ చేసుకొని వారికి Price చెబుతాను. అలాగే మా Portfolio లింక్ వారికి షేర్ చేస్తాను.
వారు కొంత సమయం తీసుకొని వారికి ఆ Price & Portfolio సరే అనుకుంటే నాతో ముందుకు వెళ్ళడానికి ఒప్పుకుంటారు. కొంతమంది reject చేస్తారు, అది ఎలాగో సహజం.
Web Design అలాగే Web Development projects కి నేను 3 Installments లో అమౌంట్ తీసుకుంటాను.
అమౌంట్ UPI ద్వారా గాని Razorpay ద్వారా గాని నా Current Accountలోకి తీసుకుంటాను.
మొదటగా Project స్టార్ట్ చేసేముందు 50% తీసుకుంటాను.
50% payment చేసిన తరువాత వర్క్ చేయడం మొదలుపెడతాను.
మొదటగా Domain register చేస్తాను. తరువాత ఆ Domain ని మా hostingకి లింక్ చేసి వెబ్సైటు డెవలప్ చేస్తాను.
నేను ఎక్కువగా Websitesకి WordPressనే వాడుతాను.
ఒకవేళ క్లయింట్ కి Website fullగా కోడింగ్ లోనే కావాలి అంటే అలాగే చేసి ఇస్తాను. కాకపొతే Price మారుతుంది.
ఈ first phase వర్క్ కంప్లీట్ అయినాక Clientని ఒకసారి Website చెక్ చేసుకోమని Inform చేస్తాను. వారు చెక్ చేసుకొని వారికి కావలసిన modifications చేయమంటారు.
Modifications చేసేముందు 2nd Installment 25% amount తీసుకుంటాను.
తరువాత వారికి కావలసిన modifications చేసి ఇస్తాను.
మొత్తం updates complete అయిన తరువాత remaining 25% amount తీసుకొని వారి Website వారి Hostingకి transfer చేసి Websiteని డెలివరీ చేస్తాను.
ఈ Process నాకు అలాగే నా Clientsకి comfortableగా ఉంటుంది.
ఇప్పుడు మీకు నా Website Design & Delivery ప్రాసెస్ తెలిసింది అనుకుంటున్నాను.
మీకు Website related services కావాలి అంటే ఇప్పుడే నన్ను Contact చేయండి.
మీకు ఏమయినా సందేహం ఉంటే ఇప్పుడే నాకు WhatsApp లో మెసేజ్ చేయండి.
ధన్యవాదములు.